Dharani

Dharani
BE WHAT YOU ARE !!!

Tuesday, September 27, 2011

పువ్వు కే మనసు ఉంటె?

            పువ్వు కే మనసు ఉంటె
            అందులో " మాట " ఉంటె ??
            చేటు అయిన చాటుతుంటే ....
            వినగలవా ఓ వనిత ???

           కనిపించని పరిమళం
           కవ్వించే సుమధురం 
           నిన్నే కలవరిస్తుంటే 
           ఆలకించవా ఓ లలనా....

దేవ దేవుని సన్నిధి కి చేరిన దాసాని 
  దేవి దాసుడైన విరాగి చేతి లో గులాబీ 
  ప్రేమ పూజకు చేరు వేల ...

విరబుసే చేమంతి , మంతనాలు ఆడే పూబంతి 
    చిన్నారుల చెలిమికి చిహ్నమైతే ...

అతివ ఐదో తనం మెప్పించే మల్లి
   కాంతను చేరు కాముడి మెడ లో విరజాజి , సన్నజాజి 
   ఆనందాన్ని అందించు సుఖ సమయం లో ...

తన లో తనువు తల్లదిన్చాలనే బ్రమారాన్ని ఇముడ్చుకున్న తామర కు
    రమణి నయనం వర్ణించి నప్పుడు కమలానికి ...

చేదని చీదరించిన ఉమ్మేతి 
చేయి వేస్తే చిన్నబోవు అత్తి పత్తి 
తమ ప్రత్యేకత ను ప్రదర్శించినప్పుడు ....

పేరంటానికి కనకాంబరం , పేదవాడి బంతి గా కదంబం 
కైలాస నాధుని రూపం లో శివ పుస్ఫం ,
చందమామ కు సాటి రాని వెన్నెల పుస్ఫం ,

 ప్రొద్దు తిరుగుడిలా వికసించే మానస 
 పొద్దు పోనిదే విలపించని రాత్రి రాణి
 ప్రకృతి చమత్కారాన్ని ప్రచురించినప్పుడు 

            తన జీవితం " సార్థకం "




No comments:

Post a Comment